ముంబయి : సూర్య హీరోగా నటించిన సినిమా జైభీమ్ సూపర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ వాస్తవ కథను ఆసక్తి కరంగా మలిచిన విధానం పలువురినీ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోని ాఅకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌్ణ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 'సీన్ ఎట్ ది అకాడెమీ' పేరుతో ఉంచారు. అకాడెమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ఉంచటం ఇదే మొదటిసారి. దర్శకుడి కథనాన్ని విశ్లేషించిన తీరుపై చర్చించడంతో పాటు సినిమాలోని ఒక సన్నివేశం ప్రసారమైంది. జ్ఞానవేల్ కథ, కథనాన్ని ఎలా నడిపించారు అన్న అంశంపై ఈ వీడియోలో చర్చించారు. ఆస్కార్ యూట్యూబ్ చానెల్‌లో సూర్య సినిమా ప్రసారం కావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. గోల్డెన్ గ్లోబ్స్ 2022లో ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో కూడా జై భీమ్ నామినేట్ అయింది.
Mon Jan 19, 2015 06:51 pm