హైదరాబాద్: ముంబయిలోని నావల్ డాక్ యార్డులో ప్రమాదం సంభవించింది. భారత నావికాదళానికి చెందిన డిస్ట్రాయర్ శ్రేణి యుద్ధనౌక ఐఎన్ఎస్ రణవీర్ లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నావికా దళ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, తీవ్రగాయాలపాలైన ముగ్గురు సిబ్బంది మృత్యువాత పడ్డారని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో మరో 11 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిని ముంబయిలోని నేవీ ఆసుపత్రికి తరలించారు. నౌకలో చెలరేగిన మంటలను సిబ్బంది అదుపులోకి తెచ్చారు. కాగా, నౌకలో ఉన్న ఆయుధాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని కేంద్ర రక్షణ శాఖ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm