హైదరాబాద్ : ఈవీఎం, బ్యాలెట్ల వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టేందుకు వీలు కల్పించేలా.. ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్న నిబంధన చట్టబద్ధతను సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయవాది ఎమ్ఎల్ శర్మ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ చట్టంలోని సెక్షన్ 61ఏ కు పార్లమెంటు ఆమోదం లేదని, కాబట్టి అమలు చేయరాదని వాదిస్తూ..ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. బ్యాలెట్ విధానంలోనే పోలింగ్ నిర్వహించాలని కోరారు. అయితే వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. త్వరలోనే దీనిపై వాదనలు ప్రారంభమయ్యే అవకాశముంది.
Mon Jan 19, 2015 06:51 pm