హైదరాబాద్: నగరంలో రెండు చోట్ల కత్తిపోట్లు కలకలం రేపింది. బేగంపేట పీఎస్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఇలాహి మజీద్ వద్ద కత్తితో దాడి జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ప్రదీప్ అనే వ్యక్తిపై మునీర్ అతని స్నేహితులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రదీప్ కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడిపోయాడు. అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు చిలకలగూడ పీఎస్ పరిధిలోని ఏకశిలా మెడికల్ హాల్ వద్ద ఇదే తరహా ఘటన జరిగింది. డబ్బుల విషయంలో సంతోష్, నవాజ్ అనే ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం చెలరేగింది. నవాజ్ తనకు రావాల్సిన డబ్బులను సంతోష్‌ను అడగడంతో గొడవ జరిగింది. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2022 10:25AM