న్యూఢిల్లీ : స్వాతంత్య్ర పోరాట యోధుడు, అజాద్ హిందు ఫౌజ్ (భారత సైన్యం) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నా నమస్కారములు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా దేశానికి నేతాజీ చేసిన గొప్ప సేవలకు ప్రతి భారతీయుడు గర్వపడాలి.` అంటూ పేర్కొన్నారు. అలాగే సుభాష్ చంద్ర బోస్ జయంతిని పరాక్రమ్ దివస్ గా జరుపు కోవాలని తమ సర్కారు నిర్ణయించినట్టు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm