ఆక్లాండ్ : న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెన్ తన వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అందుకు కారణం దేశంలో పెరుగుతన్న ఒమిక్రాన్ కేసులే. ఉత్తర ద్వీపంలోని ఆక్లాండ్‌లో జరిగిన ఓ వివాహ వేడుక తర్వాత దేశంలో ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే పలు నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తన పెండ్లిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రధాని ప్రకటించారు.
ఉత్తర ద్వీపంలోని ఆక్లాండ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ కుటుంబం దక్షిణ ద్వీపంలోని నెల్సన్‌కు విమానంలో వచ్చింది.ఈ కుటుంబంతోపాటు ఫ్లైట్ అటెండెంట్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణయింది. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. నేటి అర్ధరాత్రి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, బార్‌లు, రెస్టారెంట్లు, వివాహాలు వంటి కార్యక్రమాలకు 100 మందికి మించి హాజరు కావడానికి వీల్లేదని పేర్కొంది. ఈ వేదికల్లో వ్యాక్సినేషన్ పాస్‌లను ఉపయోగించకుంటే కనుక ఆ సంఖ్య 25కు పరిమితం అవుతుందని ప్రధాని జెసిండా తెలిపారు. అలాగే తన వివాహాన్ని కూడా రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చిక్కుకున్నట్టు అయితే తనను క్షమించాలని కోరారు. అయితే, వివాహం తిరిగి ఎప్పుడు చేసుకుంటారో తెలపలేదు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2022 11:19AM