హైదరాబాద్ : ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. దాంతో ఆ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఖాతాలో గుర్తుతెలియని మెసేజ్లు పోస్ట్ అయ్యాయని ఓ అధికారి తెలిపారు. పబ్లిష్ అయిన మెసేజ్లు లోడ్ కాలేదని డిస్ల్పే ఫొటో మాత్రమే కనిపిస్తోందని తెలిపారు. అయితే సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం 2006లోనే ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఫెడరల్ విభాగం ఏర్పడింది.
Mon Jan 19, 2015 06:51 pm