హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళకు ఆర్ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ చేయగా కాసేపటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ శనివారం రాత్రి ఆర్‌ఎంపీ క్లినిక్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు వైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చాడు. అనంతరం మహిళ ఇంటికి రాగా కాసేపటికే ఆమె మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వైద్యుడి ఇంటిని వారు ముట్టడించారు. వైద్యుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm