అమరావతి : కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బైక్ వెనుక చక్రంలో మూడు నెలల పసికందు ఇరుక్కుని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడుమూరు మండలం, ఎర్రదొడ్డిలో మూడు నెలల బాలుడికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు తల్లి ఒడి నుంచి శిశువు జారి వెనుక చక్రంలో పడిపోయి ఇరుక్కుపోయాడు. దాంతో పసికందును కాపాడ్డానికి స్ధానికులు యత్నించాడు. అయినప్పటికీ బాలుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm