హైదరాబాద్ : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జ్వర సర్వేలో ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒక్కరు జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి తదితర లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆరోగ్య సిబ్బంది గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో 29 లక్షల ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించారు. సర్వేలో మొత్తం 1.28 లక్షల మందికి జలుబు, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలున్నట్టు గుర్తించి, వారికి అక్కడికక్కడే ఔషధ కిట్లను అందించారు. తమకు లక్షణాలున్నా కానీ, భయంతో బయటకు చెప్పేందుకు ముందుకు రావడం లేదని అధికారులు తెలిపారు. ఈ రకంగా చూస్తే ప్రతి నలుగురు లేదా ఐదుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు ఎక్కువ మంది ప్రైవేటు క్లినిక్ లను ఆశ్రయిస్తుండడంతో అవన్నీ లెక్కల్లోకి చేరడం లేదు.
Mon Jan 19, 2015 06:51 pm