న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా సైన్యం నిర్వహించే బీటింగ్ రీట్రిట్‌లో ఒక ప్రముఖ బీట్‌ను తొలగించింది. అదే జాతిపిత మహాత్మా గాంధీకి ఇష్టమైన శ్లోకం... అబిడ్ విత్ మి`. బీటింగ్ రీట్రీట్ రోజున ప్రదర్శించడానికి కేంద్ర ప్రభుత్వం 26 పాటలను ఎంపిక చేసింది. అందులో అబైడ్ విత్ మీ అనే శ్లోకం స్థానంలో 'మేరే వతన్ కే లోగోన్` అనే పాటను చేర్చారు. బీటింగ్ రీట్రీట్ ముగింపు వేడుకల్లో 'అబిడ్ విత్ మి` అనే శ్లోకం శతాబ్దాల నాటి సైనిక సంప్రదాయంగా కొనసాగుతోంది.
అబైడ్ విత్ మీ అనేది ఒక క్రిస్టియన్ కీర్తన. ఈ ప్రేయర్‌ను స్కాటిష్ ఆంగ్లికన్ హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ 1847లో రాశారు. దీనికి విలియం హెన్రీ మాంక్ స్వరాలు సమకూర్చారు. ఈ కీర్తన మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టం. దీనిని 1950 నుంచి ప్రతీ గణతంత్ర వేడుక బీటింగ్ రీట్రీట్‌లో ప్రదర్శిస్తుంటారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2022 02:54PM