హైదరాబాద్ : హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు, మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్- నాగార్జున సాగర్ రహదారిపై బీఎన్ రెడ్డి నగర్ వద్ద ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై మరో బస్సు ఢీకొట్టింది. దాంతో ఆ బస్సు తన ముందున్న కారును ఢీ కొట్టింది.
ఇలా వరుసగా రెండు బస్సులు, మూడు కార్లు ఢీకొట్టుకున్నాయి. దాంతో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2022 04:18PM