హైదరాబాద్ : సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రముఖ నటులు, నటీమణులకు కరోనా సోకిన విషయం తెలిసింది. తాజాగా ప్రముఖ మలయాళ, తెలుగు నటుడు, 'అల.. వైకుంఠపురములో` ఫేం జయరామ్ సుబ్రమనియమ్ కు కరోనా సోకింది. ఈ విసయాన్ని ఆయన తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వైరస్ ఇంకా మన మధ్యే ఉందని చెప్పడానికి ఇదే గుర్తు అన్నారు. తనతో సన్నిహితంగా ఉన్న అందరూ ఐసోలేట్ కావాలన్నారు. లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను చికిత్స తీసుకుంటున్నానన్నారు. అతి త్వరలోనే అందరినీ మళ్లీ కలుస్తానని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm