హైదరాబాద్ : పంట నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆదివారం హనుమకొండలోని కలెక్టరేట్ లో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కరోనా కట్టడి, ఆస్పత్రుల్లో ఏర్పాట్లు, వడగండ్ల వర్షాల వల్ల పంట నష్టాలు, జ్వర సర్వే, దళిత బంధు అంశాల పై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొన్న కురిసిన వడగండ్ల వానకు పంట వరంగల్ లో 25,790 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 7,239 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేకుండా రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలన్నారు. మెడికల్ ఆఫీసర్ల సహకారంతో అందరికీ ఇంటిలోనే ట్రీట్ మెంట్ అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్టు చేశామన్నారు. పెండ్లీలను ప్రజలు తక్కువ మందితో చేసుకునేలా సహకరించాలన్నారు. రాష్ట్ర మంతటా దళిత బంధు ఇచ్చేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2022 06:21PM