శ్రీశైలం : శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి ఉచిత దర్శనం , రూ.150, రూ.300 దర్శనం టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారానే పొందాలని భక్తులకు ఈవో ఎస్.లవన్న సూచించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ నేపథ్యంలో ఆన్ లైన్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ ధ్రువపత్రం కూడా భక్తులు ఆన్ లైన్ లో సమర్పించే అవకాశాలన్ని కల్పించినున్నట్టు తెలిపారు. ఆర్జిత సేవల టికెట్లు కూడా ఆన్ లైన్ ద్వారానే అందించనున్నారు. www.srisailadevasthanam.org ద్వారా ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు పొందవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm