హైదరాబాద్ : కోలీవుడ్ దర్శకుడు, నటుడు ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో ద్వారా తెలిపారు. తనను ఈ మధ్య కలిసిన వారందరు కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆయన కోరారు. దయచేసి అందరు జాగ్రత్తగా ఉండాలన్నారు.
సెల్వ రాఘవన్ భార్య గీతాంజలి కూడా శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. 7/జీ బృందావన కాలనీ, యుగానికి ఒక్కడు, వంటి డబ్బింగ్ చిత్రాలతో సెల్వ తెలుగు వారికి పరిచయమయ్యారు.