వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఓ జర్నలిస్ట్ పై నోరు పారేసుకున్నారు. వైట్ హౌస్‌లో సోమవారం ప్రత్యక్ష ప్రసారం ముగిసిన అనంతరం మీడియా సభ్యులు బయటికి వస్తుండగా ఫాక్స్‌న్యూస్ జర్నలిస్ట్ 'ద్రవ్యోల్బణం రాజకీయ బాధ్యత కాదా` అని అధ్యక్షుడిని ప్రశ్నించారు. దీంతో బైడెన్ మైక్ ఆన్‌లో ఉండగానే అది గొప్ప ఆస్తి అంటూ.. ఆ జర్నలిస్ట్‌ని 'యూ స్టుపిడ్ ..` అంటూ ఓ బూతు కూడా తిట్టారు. దాంతో మీడియా సభ్యులు బైడెన్ ప్రవర్తనతో నిర్ఘాంత పోయారు. అయితే బైడెన్ ఏం అన్నారో అర్థం కాలేదని ఆ జర్నలిస్ట్ పీటర్ డూకీ అన్నారు. అనంతరం డూకీని పిలిచి వ్యక్తిగతంగా తీసుకోవద్దని బైడెన్ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm