హైదరాబాద్ : పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరగడం లేదని ఒక మహిళ మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. వేములపల్లి మండలం సల్కునుర్ గ్రామానికి చెందిన తుపాకుల సరిత కూతురు అమ్ములు మిర్యాలగూడలో ఇంటర్మీడియట్ చదువుతుంది. కాగా అమ్ములు తన ఫ్రెండ్స్ తో చనువుగా ఉన్న ఫోటోలను అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ వార్డుమెంబర్ దొంగచాటుగా చిత్రీకరించి తల్లిదండ్రులకు చేరవేశాడు. కాగా వాళ్లు అమ్ములును ఇలా చేయడం సరికాదని మందలించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమ్ములు తాను ఏ తప్పు చేయకపోయినా అకారణంగా నిందలు వేస్తున్నారంటూ డిసెంబర్ 9వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో అమ్ములు మృతికి వార్డ్ మెంబర్ అందించిన తప్పుడు సమాచారమే కారణమని పేర్కొంటూ మృతురాలి తల్లిదండ్రులు వేములపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో అమ్ములు తల్లి సరిత మనస్తాపంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఒకవైపు వేములపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తే పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని. మరోవైపు అధికార పార్టీ వార్డ్ మెంబర్ కేసు వాపసు తీసుకోవాలని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సరిత పేర్కొంటుంది. ఈ విషయంపై లోతుగా విచారణ చేస్తామని డి ఎస్ పి వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm