రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. ‘పాడిపంటలను, పిల్ల పాపలను చల్లంగా చూడమ్మ పోచమ్మ తల్లీ’ అంటూ భక్తులు బద్ది పోచమ్మ అమ్మవారిని వేడుకున్నారు. డప్పు చప్పుళ్లు, నెత్తిన బోనాలు, శివసత్తుల పునకాలతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నెత్తిన బోనాలతో గంటలపాటు క్యూలైన్‌లో నిరీక్షించారు. అమ్మవారికి ఒడిబియ్యం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm