హైదరాబాద్: 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది పేర్లున్నాయి. తెలంగాణకు చెందిన అరుదైన కళను బతికిస్తూన్న దర్శనం మొగిలయ్య (కిన్నెర మొగిలయ్య)తోపాటు రాంచంద్రయ్య, పద్మజారెడ్డిలకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లాకు సంయుక్తంగా పద్మ భూషణ్ పురస్కారం దక్కింది. ఏపీ నుంచి గరికపాటి నరసింహారావు, గోసవీడు షేక్ హాసన్(మరణానంతరం), డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగిలయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. కళాకారుడుగా కిన్నెర పాటలతో ప్రతి ఒక్కరిని తన్మయత్వంలో ముంచెత్తుతున్న మొగిలయ్య.. తరాల తెలుగు జీవన విధానం, చారిత్రక గాధలు ఒడిసిపట్టి, పాట రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాద్యం పేరునే ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మొగిలయ్యగా స్థిరపడ్డారు. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది. అంతే కాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగిలయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం ఎనిమిదో తరగతిలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Jan,2022 08:06AM