నవతెలంగాణ: హైదరాబాద్
నల్లద్రాక్ష పందిరి వాడిపోయింది.. గజల్ మువ్వ రాలిపోయింది. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన జనవరి 21, 1959 న నిజామాబాద్ లోని పాముల బస్తిలో జన్మించారు. కవిగా, రచయితగా ఎన్నో సాహిత్య సంపుటులను వెలువరించారు. ఇరవైఏడేండ్ల పాటు రాజమండ్రిలోని తెలుగు విశ్వవిద్యాలయం పీఠానికి అధిపతిగా సేవలందించారు. కొన్ని వందలమంది విద్యార్థులను గైడ్ చేశారు. ఆచార్య సుధాకర్ కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యులు, తెలుగు సలహా మండలి సభ్యులు, తెలుగు అకాడమీ సభ్యులు, ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకులుగా తెలుగు సాహితీలోకానికి విశిష్ట సేవలందించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఎండ్లూరి మానస, మనోజ్ఞ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 07:09AM