రంగారెడ్డి: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్లో దొంగల బీభత్సం కలకలం రేపుతోంది. వరుస దుకాణాల్లో అర్థరాత్రి చోరీకి పాల్పడ్డారు. బియ్యం దుకాణంతో పాటు ఓ కూల్ డ్రింక్స్ హోల్ సెల్ షాప్లో దొంగతనం జరిగింది. రెండు దుకాణాల్లో కలిపి 1 లక్ష రూపాయల వరకు నగదు చోరీ అయినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm