హైదరాబాద్: సాహిత్యలోకం నుంచి ''కొత్తగబ్బిలం`` నిష్ర్కమించినా ఆయన రచనలు ఎప్పటికీ ''వర్తమానమే'' అని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ కు గౌరీశంకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన సుధాకర్ కవిత్వాన్ని ప్రస్తుతించారు. ''వర్గీకరణీయ గోసంగి'' కవి ''అటజనికాంచె''గా సుధాకర్ సాహిత్య వెలుగులు వెదజల్లుతూనే ఉంటారు. తెలుగు సాహిత్వానికి ఇష్టుడైన గొప్పకవిని సాహిత్యరంగం కోల్పోయిందని అన్నారు. ఎండ్లూరి సుధాకర్ ది మూల సంస్కృతి కలం అని, కుల ఆదిపత్యాల మీద విరుచుకుపడ్డ ఆయన ''పాదముద్రలు'' సాహిత్యలోకంలో చెరిగిపోనివి. ఎండ్లూరి రచనలకు మరణం లేదని గౌరీశంకర్ తన సంతాపాన్ని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm