చెన్నై : తమిళనాడులో ఫిబ్రవరి 19న నగరపాలక ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో హీరో విజయ్ అభిమానులకు చెందిన విజయ్ మక్కల్ ఇయక్కం పోటీ చేయంది. ఈ విషయాన్ని విజయ్ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. నగర పాలక ఎన్నికల్లో అభిమానులు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుపై పోటీ చేయవచ్చునని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 వార్డుల్లో పోటీ చేసి 129 వార్డులలో విజయం సాధించిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm