#Tension at #Osmaniauniversity #OU #Hyderabad pic.twitter.com/2PUeaKjW9n
— ur'sGirivsk (@girivsk) January 28, 2022
హైదరాబాద్ : రాష్ర్టంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన క్యాంపస్ లో కలకలం రేపింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాలప ప్రకారం.. విద్యార్థి సురేష్ ఓయూలో పెట్రోల్ సీసాతో ఆత్మహత్యకు యత్నించాడు. అయితే గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి మాట్లాడుతూ.. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నోటిఫికేషన్లు ఇచ్చాకే టీఆర్ఎస్ నేతలు ఓయూకు రావాలన్నారు.