హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న వాహనాన్ని బొగ్గు ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చండ్రుగొండ మండలం తిప్పనపల్లెలో కూలీలతో వెళ్తున్న మినీ వ్యాన్ ను బొగ్గు ట్రక్కు ఢీకొట్టింది. దాంతో వ్యాన్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. మరో తొమ్మిది మందికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మృతులు కొత్తగూడెం సమీపంలోని సుజాతనగర్ వాసులు కత్తి స్వాతి, ఎకరాల సుజాత, గుర్రం లక్ష్మిగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm