హైదరాబాద్ : ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యాఖ్యలతో రామ్ గోపాల్ వర్మ సంచలనాలు సృష్టిస్తాడన్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే ఆయన ఒకటి క్రియేట్ చేశాడు. పబ్‌లో అమ్మాయిలతో మద్యం తాగుతూ చిందులేశాడు. అంతేకాకుండా నటి ఇనయా సుల్తానాకు ముద్దుపెట్టాడు. అందుకు సంబంధించిన వీడియోలను ఆయన స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. దాంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే పలువురు దీనిపై విమర్శలు చేస్తున్నారు. ఇలా హీరోయిన్ లతో కలిసి తాగి, ముద్ద పెట్టడం వల్ల సినీ పరిశ్రమపై తప్పుడు అభిప్రాయం కలుగుతుందని కామెంట్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm