హైదరాబాద్ : దేశంలో భారీగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు యత్నించిన పాక్ స్మగర్లను భద్రతా సిబ్బంది అడ్డుకుంది. వారి వద్ద నుంచి 47 కేజీల హెరాయిన్ సహా ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
పూర్తి వివరాల్లోకెళ్తే.. పంజాబ్ లోని గురుదాస్పుర్లో చందూ వదాలా పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం 5.15 గంటల సమయంలో పాక్ స్మగ్లర్ల కదలికలను ఓ జవాన్ గమనించాడు. వెంటనే వారిపై కాల్పులు జరిపగా వారు ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో స్మగ్లర్లను భద్రతా సిబ్బంది తరిమికొట్టారు. స్మగ్లర్ల నుంచి 47 కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 7 ప్యాకెట్ల నల్లమందు, 2 మ్యాగజైన్లు ఉన్న ఓ చైనీస్ పిస్టల్, ఏకే 47 పిస్టళ్లు సహా ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా స్మగ్లర్లు జరిపిన కాల్పుల్లో భా ఓ బీఎస్ఎఫ్ జావాను గాయపడ్డాడు. అతని తలలోకి బులెట్ దిగినట్టు తెలిసింది. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 12:16PM