హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తనను కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కర్ణాటక శాసనమండలిలో విపక్ష నేత పదవిని తనకు ఇవ్వాలని ఇబ్రహీం చాలా కాలంగా కోరుతున్నారు. అయితే, ఆయనకు ఆ పదవిని ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యాయి. మండలిలో విపక్ష నేతగా బీకే హరిప్రసాద్ ను కాంగ్రెస్ నిన్న నియమించింది. దీంతో ఆ పార్టీకి ఇబ్రహీం గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఇబ్రహీం మాట్లాడుతూ, హరిప్రసాద్ తనకంటే జూనియర్ అని, ఆయన కింద తాను ఎలా పని చేయగలనని ప్రశ్నించారు.
ఇక ఇప్పుడు తనకు ఎలాంటి బాధ్యత లేదని... ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా తనకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. తన శ్రేయోభిలాషులతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఇప్పటి నుంచి తనకు కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధం లేదని... ఆ పార్టీ తన జీవితంలో ఒక ముగిసిపోయిన అధ్యాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా నాశనం అవుతూ వస్తోందని ఇబ్రహీం వ్యాఖ్యానించారు. డబ్బు లేకుండా కాంగ్రెస్ లో పని చేసే నాయకుడే లేడని ఆరోపించారు. నెహ్రూ, ఇందిరల హయాంలో కాంగ్రెస్ ఒక సోషలిస్టిక్ పార్టీగా ఉండేదని... ఇప్పుడు 'లేనా బ్యాంక్'గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ నిండా మునిగిపోయిందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 12:25PM