హైదరాబాద్ : బాలీవుడ్ నటి శ్వేతా తివారీ దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ కు సంబంధించి జరిగిన ఓ ప్రెస్ మీట్ మాట్లాడుతూ.. తన తన బ్రా కొలతలను దేవుడు తీసుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె వ్యాఖ్యలు దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్ల మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హోం మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై ఎఫ్ ఐఆర్ నమోదైంది.
శ్వేతా తివారీ ప్రస్తుతం షో స్టాపర్ అనే వెబ్ సిరీస్‌లో బ్రా ఫిట్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో మహాభారతం సీరియల్‌లో కృష్ణుని పాత్ర పోషించిన సౌరభ్ రాజ్ జైన్ కూడా నటిస్తున్నాడు. దాంతో సౌరభ్ రాజ్‌ను ఆమె దేవుడితో పోల్చి.. అతను తన బ్రా కొలతలు తీసుకుంటున్నాడని ఆమె జోక్ చేశారు. దాంతో ఆమెపై పలు విమర్శలు వస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 03:38PM