హైదరాబాద్ : కరోనా నియంత్రణకు భారత్ బయోటిక్ కంపెనీ రూపొందించిన చుక్కల మందు బూస్టర్ డోస్ క్లినికల్ పరీక్షల నిర్వహణకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. కోవిషీల్డ్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్ కింద ఈ చుక్కల మందు అనువైందని భారత్ బయోటిక్ తెలిపింది. ఫేజ్ 3 బూస్టర్ డోస్‌లో భాగంగా చుక్కల మందు టీకాకు డీసీజీఐ నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం ఇచ్చింది. ఈ అనుమతులు పొందిన మొదటి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఫేజ్ 3 బూస్టర్ డోస్ కోసం దరఖాస్తు చేసుకున్న రెండో కంపెనీగా భారత్ బయోటిక్ నిలిచింది.
Mon Jan 19, 2015 06:51 pm