హైదరాబాద్ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. వాచ్ టవర్ నుంచి కిలోమీటర్ దూరంలోని నీలాద్రి అటవీ ప్రాంతంలో పులి అడుగులను గుర్తించినట్లు వారు తెలిపారు. నీలాద్రి పరిసరాల్లో పులి జాడ కోసం సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జనం ఆ పరిసరాల వైపు వెళ్లొద్దని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm