హైదరాబాద్ : ఖమ్మంలో త్వరలో కీమో థెరఫీ, రేడియో థెరఫీ సేవలు అందించనున్నట్టు మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో అధునాతన క్యాథ్ ల్యాబ్, ట్రామా కేర్, మిల్క్ బ్యాంక్ ను వారు ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ లు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రూ. 7.5 కోట్లతో క్యాథ్ ల్యాబ్ ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇది నాల్గవ ల్యాబ్ అని తెలిపారు. నిమ్స్, ఉస్మానియ, ఎంజిఎం ఆస్పత్రుల్లో మాత్రమే ఇది ఉంది. గుండె సంబంధ సమస్యలకు లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్స ఇక్కడ ఉచితంగా అందనున్నదని తెలిపారు. అలాగే కార్డియాలజీస్టులను నియమించామని తెలిపారు. వచ్చే ఆర్థిక ఏడాదిలో ఖమ్మం ఆస్పత్రిలో అత్యాధునిక ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం మార్చురీలను ఆధునికీకరణ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే చేసి 3,45,951 కిట్లను అందించామని తెలిపారు. రెండు డోసులు పూర్తి చేయడంలో ఖమ్మం జిల్లా 94 శాతంలో రెండో స్థానం లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 04:05PM