హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ గూండాయిజం చేస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. నగరంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్‌లతో కలిసి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. సోషల్ మీడియా ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆయన అన్నారు. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసిన కేసీఆర్, కేటీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm