హైదరాబాద్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం
డిమాడ్లు
1) 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త క్యాడర్లకు కేటాయింపు వలన ఉపాధ్యాయులకు ఏర్పడిన ఇబ్బందులను పరిష్కరించాలి.
2) కొత్త క్యాడర్ల కేటాయింపు వలన స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను తమ స్థానిక క్యాడరుకు బదిలీ చేయాలి.
3).సీనియారిటీ మరియు ఇతర సమస్యలపై ఉపాధ్యాయులు పెట్టుకున్న అప్పీళ్ళను వెంటనే పరిష్కరించాలి.
4). పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలి.
5).స్పౌజ్ మరియు సింగిల్ ఉమెన్ సమస్యలను పరిష్కరించాలి.
6). ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి.
కొత్త క్యాడర్ల కేటాయింపు వలన ఉపాధ్యాయులు ఆందోళనతో ఉన్నారు . రాష్ట్ర ప్రభుత్వము ప్రజాస్వామ్యయుతంగా , పారదర్శకంగా ప్రక్రియ కొనసాగిస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు . ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి , సానుకూలంగా పరిష్కరించాలి. ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్న పైన పేర్కొన్న సమస్యలన్నింటినీ పరిష్కారము చేయవచ్చును. పై సమస్యలన్నింటికీ తక్షణమే పరిష్కారం చూపాలి లేనియెడల భవిష్యత్తులో విద్యార్థులు,ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర పరిపాలనను స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నాము.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 05:20PM