హైదరాబాద్ : పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఆయన సోదరి సుమన్ తూర్ సంచలన ఆరోపించారు. చేశారు. కుటుంబ ఆస్తిని దక్కించుకునేందుకు సిద్ధూ తన తల్లిని ఇంట్లోంచి గెంటేశారని ఆరోపించారు. చండీగఢ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవాస భారతీయురాలు, సిద్ధూ సోదరి సుమన్ తూర్ మాట్లాడుతూ..1986లో తమ తండ్రి చనిపోయిన తర్వాత నవజ్యోత్ సిద్ధూ తన తల్లితో పాటు తనను బయటకు గెంటేశారని ఆరోపించింది. అనంతరం తన తల్లి 1989లో రైల్వే స్టేషన్‌లో మరణించిందని తుర్ పేర్కొన్నారు. తాను చాలా కఠినమైన రోజులు చూశానని, తన తల్లి నాలుగు నెలలు ఆస్పత్రిలో ఉందన్నారు. తాను ఆరోపిస్తున్న దానికి సంబంధించిన డాక్యుమెంటరీ సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. ఆస్తి కోసమే సిద్ధూ తమతో సంబంధాలు తెంచుకున్నారని సుమన్ తుర్ ఆరోపించారు.తమ నాన్న పింఛనుతో పాటు ఇల్లు, భూమితో సహా ఆస్తులను విడిచిపెట్టాడు అన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ డబ్బు కోసం తమ అమ్మను విడిచిపెట్టాడని.. ఆయన నుంచి మాకు డబ్బు అక్కర్లేదన్నారు. వచ్చే నెలలో పంజాబ్ లో ఎన్నికలు జరగనుండగా సిద్ధూ పై ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm