అమరావతి : ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇప్పటివరకు చనిపోయేవారి సంఖ్య 10 లోపే ఉండగా ఇప్పుడే ఏకంగా 12 మందికి ఈ మహమ్మారికి బలయ్యారు.గడచిన 24 గంటల్లో 40,635 శాంపిళ్లకు కరోనా పరీక్షలు చేయగా 12,561 మందికి పాజిటివ్ గా నిర్ధారణయింది. అలాగే కొత్తగా 12 మంది మరణించడం కలకలం రేపుతోంది. 8,742 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో 1,710 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 1,625 కేసులు, కడప జిల్లాలో 1,215 కేసులు, విశాఖ జిల్లాలో 1,211 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో ముగ్గురు మరణించగా, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అనంతపురం, చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
ఏపీలో ఇప్పటివరకు 22,48,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా 21,20,717 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 14,591కు పెరిగింది. ఇంకా రాష్ర్టంలో 1,13,300 మంది చికిత్స పొందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 05:47PM