హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవ బెయిల్ పిటిషన్‌ను కొత్తగూడెం 5వ అదనపు కోర్టు కొట్టివేసింది. శుక్రవారం కొత్తగూడెం 5వ అదనపు కోర్టులో వనమా రాఘవ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. రాఘవ తల్లిదండ్రులతో పాటు భార్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. వాటిని దృష్టిలో పెట్టుకుని రాఘవకి బెయిల్ మంజూరు చేయాలని అతని తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అయితే అందుకు కోర్టు నిరాకరించి.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. వనమా రాఘవ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 05:57PM