- వ్యవధి కావాలన్న వ్యాపారులు
- సమయం లేదన్న సర్పంచ్
నవతెలంగాణ గోవిందరావుపేట
మండలంలోని పసర పంచాయితీ మేడారం రహదారిలో ఆర్చి నుండి రహదారి విస్తరణ చేపడతామని శుక్రవారం పంచాయతీ సిబ్బంది వ్యాపారుల దుకాణాల ముందున్న రేకుల తొలగించేందుకు రావడంతో పరిస్థితి రసాభసగా మారింది. ఆర్ అండ్ బి డి ఈ రఘువీర్. సర్పంచ్ ముద్దరబోయిన రాము లు దుకాణాల ముందు ఉన్న రేకులు తొలగించాలని రహదారి విస్తరణ పనులు చేపడతామని వ్యాపారులతో అన్నారు. రహదారి ఇరుకుగా ఉండడంవల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వర్షం పడినప్పుడు నీరు నిలువ ఉండకుండా ఉండేవిధంగా డ్రైనేజీ పనులు చేపడతామని అన్నారు. ఇప్పటికిప్పుడు రేకుల సముదాయాన్ని తొలగిస్తే ఎలా అని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మరో 15 రోజుల్లో జాతర ఉండగా ఇప్పటికే సరుకు తెచ్చుకుని సిద్ధంగా ఉన్నామని ఈ పరిస్థితుల్లో రహదారి విస్తరణ పేరుతో డిస్టర్బ్ చేస్తే వ్యాపారం దెబ్బతింటుందని వారు వాపోయారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం మహా జాతర సందర్భంగా వ్యాపారంలో ఎంతోకొంత లాభం జరుగుతుందని ఆశతో ఇంతకాలం ఉన్నామని వ్యాపారులు అన్నారు. జాతర తరువాత విస్తరణ పనులు చేపడితే తాము సహకరిస్తామని వారన్నారు. జాతర అయిపోయే వరకు సమయం కావాలని వ్యాపారులు లేదు ఇప్పుడే జరగాలని సర్పంచ్ ఒకరినొకరు వాదులాడు కోవడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.తీవ్రంగా వాగ్వివాదం జరుగుతుండగా పోలీసులు వచ్చి ఇరువురు నివారించి సముదాయించి సామరస్యంగా మాట్లాడుకోవాలని సూచించడంతో గొడవ కాస్త సద్దుమణిగింది. సర్పంచ్ తో పాటు రహదారి అధికారులు కూడా జాతర వరకు తమకు సహకరించి ఆదుకోవాలని వారు కోరారు. ఇంతటి తో గొడవ పడడం తో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 06:07PM