హైదరాబాద్ : జార్ఖండ్‌లో దాంణం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను హత్య చేసి, వారి చెరో కన్నును దుండగుల పీకేశారు. ఈ అత్యంత క్రూరమైన ఘటన పాకూర్‌లోని అమ్రపరా పోలీస్ స్టేషన్ పరిధిలో అంబడిహ్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పొలంలో ఒక కుటుంబానికి చెందిన బాలిక, బాలుడు మృతదేహాలను గురువారం రాత్రి గుర్తించారు. వారి కండ్లు తీసేసి ఉన్నాయని ఎస్పీ జనార్దనన్ తెలిపారు. బాలిక వయసు 12 ఏండ్లు, బాలుడికి 10 ఏండ్లు ఉంటుందని చెప్పారు. తండ్రి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత శత్రుత్వం సహా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గురువారం సాయంత్రం మైనర్‌లను ఓ బంధువు తన ఇంటికి పిలిపించాడని కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి బంధువును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 06:21PM