హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ బస్సు డిపోలో ఓ బస్ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజయ్య అనే వ్యక్తి బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన పురుగుల మందు తాగడంతో స్థానికులు గమనించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం రాజయ్య ఓ యాక్సిడెంట్ చేశాడు. దాంతో అతనిని సస్పెండ్ చేస్తారేమోనని మనస్తాపంతో ఆత్మహత్యా యత్నం చేశాడని అధికారులు చెబుతున్నారు. అయితే రాజయ్య ఆత్మహత్యాయత్నానికి అధికారుల వేధింపులే కారణమని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm