హైదరాబాద్ : రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో, మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి కథానాయికలుగా సందడి చేయనున్నారు.
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఆయన బాణీలను సమకూర్చిన మూడు సింగిల్స్ ను వదలగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో రీసెంట్ గా ఫోర్త్ సింగిల్ గా 'ఫుల్ కిక్కు' అనే పాటను రిలీజ్ చేశారు. ఈ మాస్ బీట్ కి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా సాగర్ ఆలపించాడు. యూ ట్యూబ్ లో ఈ పాటను ఇలా వదలడమే ఆలస్యం అలా దూసుకుపోతోంది. ఇంతవరకూ ఈ సాంగ్ 4 మిలియన్ ప్లస్ వ్యూస్ ను, 1.6 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. రవితేజ - డింపుల్ హయతిపై చిత్రీకరించిన ఈ పాట అదే ఊపును కొనసాగిస్తూ ట్రెండింగులో నిలవడం విశేషం. భారీ తారాగణం నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 07:55PM