హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు చూస్తున్న ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి కుమార్తె వివాహానికి బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఈ షెల్ కంపనీలకు ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై వాస్తవాలను తెలంగాణ సమాజానికి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఆరోపణలపై కూడా విచారణ జరపాలని ఆయన కోరారు. పెద్దలకు ప్రాజెక్టు కాంట్రాక్టర్ నుంచి వేల కోట్లు ముడుపులు అందినట్లు ఆరోపణలున్నాయని ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm