హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా 1,01,812 శాంపిల్స్ పరీక్షించగా.. 3,877 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో ఇద్దరు కరోనా బాధితులు మరణించగా.. ఇదే సమయంలో 2,981 మంది కరోనా నుంచి పూర్థిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 7,54,976కు చేరగా.. రికవరీ కేసులు 7,10,479కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 4,083కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,414 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. రికవరీ రేటు 94.11 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది ఆరోగ్యశాఖ..
Mon Jan 19, 2015 06:51 pm