హైదరాబాద్ : నటుడు విజయ్‌కి మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. విజయ్ విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలుచేశారు. దీనికి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంట్రీట్యాక్స్ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ నటులు ఇలా పన్ను ఎగవేతకు పాల్పడడం సమంజసం కాదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయ్ ఎంట్రీట్యాక్స్ చెల్లించారు. అయితే ప్రత్యేకన్యాయమూర్తి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను రద్దు చేయాలంటూ విజయ్ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ శుక్రవారం జరిగింది. ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా న్యాయస్తానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm