హైదరాబాద్ : ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. మహేష్ అనే యువకుడు ఈ ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని ఎస్.ఆర్.నగర్ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm