సంగారెడ్డి : చౌటకుర్ మండలం శివంపేట వద్ద చెరుకుతో నిండిన ఎద్దుల బండిని 108 అంబులెన్స్ ఢీకొట్టింది. ప్రెగ్నెన్సీ మహిళను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న మహిళకు గాయాలయ్యాయి. మరో అంబులెన్స్‌లో గాయపడిన మహిళను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm