విశాఖ : వి.మాడుగుల మండలం ఎం.కోడూరు జంక్షన్‌లో స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 640 కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అధికారులు అరెస్ట్ చేశారు. బోలేరో వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ 50 లక్షలు ఉంటుందని అంచనా.
Mon Jan 19, 2015 06:51 pm