కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆస్పత్రిలో కరోనా వార్డులో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని కోవిడ్ వార్డులో తెల్లవారుజామున 4 గంటలకు మంటలు చెలరేగాయి. దాంతో సంధ్యా మోండల్ (60) అనే వ్యక్తి మృతి చెందారు వార్డులోని ఇతర రోగులను సకాలంలో వేరే విభాగానికి తరలించామని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే అధికారులు మంటలను ఆర్పివేశారని తెలిసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తపస్ కుమార్ ఘోష్ తెలిపారు.