హైదరాబాద్ : మహారాష్ట్ర నందుర్బార్ జిల్లాలో.. ఓ రైలులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా రైల్వే స్టేషన్కు రాగానే గాంధీధామ్- పూరీ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఉదయం 10.45 నిమిషాలకు రైలు బోగీల్లో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు బయటకు పరుగులు పెట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm